ఓ కంపెనీలో గెట్ టు గెదర్ పార్టీ..యువతిపై అత్యాచారం | girl raped by youth at get together party | Sakshi
Sakshi News home page

ఓ కంపెనీలో గెట్ టు గెదర్ పార్టీ..యువతిపై అత్యాచారం

Published Mon, Sep 23 2013 4:13 PM | Last Updated on Thu, Sep 27 2018 2:34 PM

girl raped by youth at get together party

గుర్గావ్: కామాంధులకు ఓవైపు ఉరిశిక్షలు పడుతున్నా అత్యాచారాల ఆగడాలు ఏమాత్రం ఆగడంలేదు. ఎనిమిదో నంబర్ జాతీయ రహదారిపైగల మనేసర్ ప్రాంతంలోని ఓ క్లబ్‌లో యువతిపై అత్యాచారం జరిగింది. నిందితుడిని భీవని ప్రాంతానికి చెందిన సుమిత్‌గా గుర్తించారు.  స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో దాదాపు 50 మందికిపైగా పనిచేస్తున్నారు. వీరంతా కలిసి గెట్ టు గెదర్ పేరుతో పార్టీ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పార్టీలో అందరితో కలిసే శీతల పానీయాన్ని తాగిన బాధితురాలు మత్తులోకి జారుకుంది. దీనిని అదనుగా చేసుకొన్న సుమిత్ ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు.

 

తనపట్ల జరిగిన దారుణాన్ని గుర్తించిన బాధితురాలు విషయాన్ని తండ్రికి చెప్పడంతో ఆయన ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులేకాదు తాను పనిచేస్తున్న కంపెనీ కూడా యువకుడిపై చర్య తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేసింది. అయితే కంపెనీ అధికారులు మాత్రం దీనిపై మాట్లాడేందుకు నిరాకరించారు. బాధితురాలు గుర్గావ్‌లోని సంజయ్‌గ్రామ్ కాలనీలో నివసిస్తోందని, ఆమె తండ్రి ఫిర్యాదుతో యువతికి వైద్య పరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరిగినట్లు రుజువైందని దక్షిణ ఢిల్లీ డీసీపీ రాహుల్ శర్మ తెలిపారు. నిందితుడిని అరెస్టు చేశామని, విచారిస్తున్నామన్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement