'సీఎం గారూ.. జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉండండి' | Get Ready To Go To Jail, BJP Tells Arvind Kejriwal | Sakshi
Sakshi News home page

'సీఎం గారూ.. జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉండండి'

Jan 9 2016 8:57 AM | Updated on Sep 3 2017 3:23 PM

'సీఎం గారూ.. జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉండండి'

'సీఎం గారూ.. జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉండండి'

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వేసిన పరువు నష్టం కేసులో అరవింద్ కేజ్రీవాల్ జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉండాలని బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ సూచించారు. రాజ్యాంగ విరుద్ధమైన పనులను కేజ్రీవాల్ ఒకదాని తరువాత మరొకటి చేపడుతున్నారని ఆయన ఆరోపించారు.

ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ పూర్తిగా విఫలమయ్యారని, తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే తమ పార్టీ నేతలపై విమర్శలకు దిగుతున్నారని శ్రీకాంత్ శర్మ విమర్శించారు. కేజ్రీవాల్, ఆయన అనుచరులు డీడీసీఏ విషయంలో తీసుకున్నటువంటి రాజ్యాంగేతర నిర్ణయాలకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని బీజేపీ హెచ్చరించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement