ప్రమాదంలో లింగ సమానత్వం: సుప్రీం | Gender equality in danger : Supreme | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో లింగ సమానత్వం: సుప్రీం

Apr 12 2016 2:10 AM | Updated on Sep 2 2018 5:24 PM

కేరళలోని శబరిమల గుడిలోకి మహిళలకు ప్రవేశం కల్పించాలా.. వద్దా అనేది సంప్రదాయాలను బట్టి కాకుండా రాజ్యాంగసూత్రాల ప్రకారం నిర్ణయించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల గుడిలోకి మహిళలకు ప్రవేశం కల్పించాలా.. వద్దా అనేది సంప్రదాయాలను బట్టి కాకుండా రాజ్యాంగసూత్రాల ప్రకారం నిర్ణయించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కోర్టు  సోమవారం విచారించింది.

పిటిషన్ ప్రకారం.. దేవాలయంలో లింగ సమానత్వం ప్రమాదంలో ఉందని పేర్కొంది.  ‘ఆచారాలు రాజ్యాంగ విలువలను అధిగమించలేవు. ఎవరైనా దేవుణ్ని పూజించొచ్చు. ఆచారాలను, అత్యధికుల అభిప్రాయాల బట్టి తీర్పులివ్వం. రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటాం’ అని స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement