గడ్కారీకి రూ.10 వేల జరిమానా! | Gadkari Rs 10 thousand fine! | Sakshi
Sakshi News home page

గడ్కారీకి రూ.10 వేల జరిమానా!

Dec 21 2014 2:22 AM | Updated on Sep 2 2017 6:29 PM

కేజ్రీవాల్‌పై పరువునష్టం కేసులో అఫిడవిట్ వేయనందుకు ఢిల్లీ కోర్టు ఆదేశం

కేజ్రీవాల్‌పై పరువునష్టం కేసులో అఫిడవిట్ వేయనందుకు ఢిల్లీ కోర్టు ఆదేశం
 
 న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై వేసిన పరువునష్టం కేసులో తమ ఆదేశాలకు అనుగుణంగా అఫిడవిట్ దాఖలు చేయనందుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కారీకి ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్  గోమతి మనోచా రూ.10 వేల జరిమానా విధించారు.

నిబంధనల ప్రకారం విచారణకు కనీసం3 రోజుల ముందు గడ్కారీ కోర్టుకు అఫిడవిట్ సమర్పించాల్సి ఉంది. అయితే విచారణ రోజైన శనివారమే ప్రమాణపత్రం దాఖలు చేయడాన్ని మేజిస్ట్రేట్ తీవ్రంగా పరిగణించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.10 వేలు కట్టాలని ఆదేశిస్తూ.. విచారణను 2015, మార్చి 21కి వాయిదా వేశారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement