నేటి నుంచి ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ పర్యటన | French President Hollande trip from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ పర్యటన

Jan 24 2016 6:18 AM | Updated on Aug 21 2018 9:33 PM

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ ఆదివారం భారత్‌కు రానున్నారు.

చండీగఢ్: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ ఆదివారం భారత్‌కు రానున్నారు. మూడురోజుల పాటు హోలాండ్ భారత్‌లో పర్యటిస్తారు. చండీగఢ్‌లో ఆదివారం జరగనున్న భారత్-ఫ్రాన్స్ బిజినెస్ సదస్సులో పాల్గొంటారు. ఆ తరువాత ప్రముఖ స్థలాలను సందర్శిస్తారు. సాయంత్రం ఢిల్లీకి బయలు దేరుతారు. రిపబ్లిక్ పరేడ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొనటంతో పాటు మోదీతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరుపుతారు.

Advertisement
 
Advertisement
Advertisement