ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టుల మృతి | Four Naxlas killed in Bihar | Sakshi
Sakshi News home page

ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టుల మృతి

Mar 8 2017 3:28 PM | Updated on Sep 5 2017 5:33 AM

భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు.

న్యూఢిల్లీ:
భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. ఈ సంఘటన బిహార్‌లోని గయ జిల్లా బస్కత్వా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఏకే అసాల్ట్‌ రైఫిల్‌, ఒక ఎస్‌ఎల్‌ఆర్‌, రెండు ఇన్సాస్‌ రైఫిళ్లు ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్నామని సీఆర్‌పీఎఫ్‌ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గయ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో కూంబింగ్‌ ముమ్మరం చేసినట్లు ఆయన వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement