నలుగురు ఉగ్రవాదులు హతం | Four infiltrators killed by Army in Kupwara district | Sakshi
Sakshi News home page

నలుగురు ఉగ్రవాదులు హతం

Apr 10 2017 10:37 AM | Updated on Sep 5 2017 8:26 AM

నలుగురు ఉగ్రవాదులు హతం

నలుగురు ఉగ్రవాదులు హతం

అక్రమంగా భారత్‌లోకి అడుగుబెట్టడానికి యత్నించిన ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది

శ్రీనగర్‌: అక్రమంగా భారత్‌లోకి అడుగుబెట్టడానికి యత్నించిన ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. జమ్ముకశ్మీర్‌ కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి సోమవారం చొరబాటుకు యత్నించిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది తుదిముట్టించారు.

కెరాన్‌ సెక్టార్‌ ప్రాంతంలో చొరబాటుకు యత్నిస్తుండగా.. భద్రతా సిబ్బంది వారిపైకి కాల్పులు జరిపారు. ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇప్పటివరకు నలుగురు తీవ్రవాదులు హతమయ్యారని.. ప్రస్తుతం కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని.. అధికారులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement