చెరువులోకి దూసుకెళ్లిన జీపు, నలుగురు మృతి | Four of family killed as jeep falls into pond | Sakshi
Sakshi News home page

చెరువులోకి దూసుకెళ్లిన జీపు, నలుగురు దుర్మరణం

Jan 2 2018 3:23 PM | Updated on Aug 30 2018 4:17 PM

జైపూర్‌ : జీపు చెరువులో పడి నలుగురు మృతిచెందిన సంఘటన రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ జిల్లాలో జరిగింది. ఈ ఘోర ప్రమాదం తెల్లవారుజాము దాటిన తర్వాత జరిగింది. మధుర నుంచి అల్వార్‌కు తిరిగి వెళ్తుండగా డ్రైవర్‌ జీపుపై అదుపు కోల్పోవడంతో చెరువులోకి పడిపోయింది. ఈ సంఘటనలో ఇంద్ర జైన్‌(38), పవన్‌ జైన్‌(40), అతని భార్య మనీషా(38), వారి ఏడేళ్ల వయసున్న కుమార్తె ప్యారి చనిపోయారు. మరో ఐదుగురు గాయపడగా చికిత్స పొందుతున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబీకులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement