కాలనీ అమ్మాయికోసం కత్తులతో.. | for a girl two groups launched street fight | Sakshi
Sakshi News home page

కాలనీ అమ్మాయికోసం కత్తులతో..

Aug 16 2016 9:34 AM | Updated on Oct 2 2018 6:46 PM

కాలనీ అమ్మాయికోసం కత్తులతో.. - Sakshi

కాలనీ అమ్మాయికోసం కత్తులతో..

అచ్చం సినిమాలోలాగే.. మా కాలనీ అమ్మాయిని విడిచిపెట్టు లేదంటే నీ అంతు చూస్తామని బెదిరింపులు.. బెదిరించడం కాదు.. ఎవరు ఏమిటో తేల్చుకుందాం ప్లేస్ చెప్పు అని మరోవైపు నుంచి ఘాటు సమాధానం..

బెంగళూరు: అచ్చం సినిమాలోలాగే.. మా కాలనీ అమ్మాయిని విడిచిపెట్టు లేదంటే నీ అంతు చూస్తామని బెదిరింపులు.. బెదిరించడం కాదు.. ఎవరు ఏమిటో తేల్చుకుందాం ప్లేస్ చెప్పు అని మరోవైపు నుంచి ఘాటు సమాధానం.. ఫలితంగా రెండు గ్రూపులు ఒక చోట చేరి పిచ్చికొట్టుడు కొట్టుకోవడమేకాదు.. కత్తులతో పొడుచుకున్నారు కూడా. ప్రస్తుతం వారంతా ఆయా ఆస్పత్రుల్లో చికిత్సపొందుతుండగా కోలుకున్నవారిని కోలుకున్నట్లే తీసుకెళ్లి జైలులో పడేస్తున్నారు పోలీసులు.

ఈ ఘటన కర్ణాటకలోని బసవేశ్వర్ నగర్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అజిత్ కుమార్ అనే యువకుడు కొరియో గ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. అతడు రాజాజీ నగర్లో ఓ డ్యాన్స్ స్టూడియోను నడుపుతున్నాడు. అతడు బసవేశ్వర్నగర్ కు చెందిన ఓ అమ్మాయితో చనువుగా ఉంటున్నాడు. ఆమె అతడి క్లాస్మేట్ కూడా. అయితే ఆ అమ్మాయి ఇంటి చుట్టుపక్కల ఉండే అబ్బాయిలు ఈ విషయం జీర్ణించుకోలేకపోయారు. వీరిలో శివ ప్రసాద్ అలియాస్ కెంచా అనే వ్యక్తికి వారిద్దరి రిలేషన్ నచ్చలేదు. దీంతో అతడు అజిత్ కు ఫేస్ బుక్ లో వార్నింగ్ ఇచ్చాడు.

అమ్మాయిని కలవడం ఆపేయాలని తనను మరోసారి కలవాలంటే ముందు తనను ఓడించాకే ఆ సాహసం చేయమని హెచ్చరించారు. దీనిని సీరియస్ గా తీసుకున్న అజిత్ ఎక్కడ కలవాలో ప్లేస్ చెప్పమన్నాడు. బసవేశ్వర్ నగర్ లోని శంకర్ మఠ్ వద్దకు రమ్మన్నారు. సరిగ్గా రాత్రి 10.15గంటలకు అజిత్ తన ఫ్రెండ్స్తో అక్కడికి వెళ్లగా శివ ప్రసాద్ తన స్నేహితులతో కలిసి బైక్ పై వచ్చారు. వచ్చి రాగానే ఫైట్ స్టార్ట్ చేశారు. కర్రలు పదునైన ఆయుధాలు, కత్తులతో ఒకరినొకరు తీవ్రంగా గాయపరుచుకున్నారు. వీరి గొడవ చూసిన చుట్టుపక్కల వారు పోలీసులకు చెప్పగా వారు వచ్చి అందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రిలో చేర్పించి కోలుకున్న వారిని జైలుకు తరలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement