
భారీ అగ్నిప్రమాదం : ఆరుగురు మృతి
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జకీర్‌నగర్‌లోని ఓ బహుళ అంతస్ధుల భవనంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మరణించగా 11 మందికి గాయాలయ్యాయి.
అగ్నిప్రమాదంపై సమాచారం అందుకోగానే ఘటనా స్ధలానికి చేరుకున్న ఎనిమిది అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. అగ్నిప్రమాదం జరిగిన భవనం నుంచి 20 మందిని భవనం నుంచి వెలుపలికి తీసుకువచ్చారు. భారీగా ఎగిసిపడిన మంటలతో అక్కడ పార్క్ చేసిన ఏడు కార్లు, ఎనిమిది బైక్‌లు దగ్ధమయ్యాయి.