పడవ బోల్తా : ఐదుగురి గల్లంతు | Five missing in boat capsize | Sakshi
Sakshi News home page

పడవ బోల్తా : ఐదుగురి గల్లంతు

May 15 2016 12:25 PM | Updated on Apr 4 2019 5:25 PM

పశ్చిమబెంగాల్ బుద్వాన్ జిల్లాలో కల్నా సమీపంలోని భగీరథీ నదిలో శనివారం రాత్రి పడవ బోల్తా పడింది.

బుద్వాన్: పశ్చిమబెంగాల్ బుద్వాన్ జిల్లాలో కల్నా సమీపంలోని భగీరథీ నదిలో శనివారం రాత్రి పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గల్లంతయ్యారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ గౌరబ్ శర్మ వెల్లడించారు. కల్నాలో జరిగిన ఉత్సవాల్లో పాల్గొని వారంతా నడియా జిల్లాలో శాంతిపూర్ తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో పడవలో చాలా మంది ఉన్నారని... వారిలో చాలా మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారని తెలిపారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement