
భువనేశ్వర్ : ఢిల్లీ - భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా ఖంటపడ రైల్వే స్టేషన్‌లో శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు.. రైలు చివరి పెట్టె అయిన జనరేటర్ బోగిలో మంటలు చెలరేగాయి. దీన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే ఆ బోగిని వేరు చేసి మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ప్రయాణికులేవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.
Fire broke out in the power car of New Delhi-Bhubaneswar Rajdhani Express near Khantapada, Odisha. The fire has been brought under control and no casualties or injuries have been reported. As safety measure generator car has been detached. pic.twitter.com/stMB9yz5uf
— ANI (@ANI) May 11, 2019
గత నెలలో ఇదే రైలులో కలుషిత ఆహారం తిని 20 మంది అస్వస్థతతకు గురయిన సంగతి తెలిసిందే. దాంతో అప్పటికప్పుడు రైలును బొకారో రైల్వే స్టేషన్‌లో ఆపి అస్వస్థతకు గురైన ప్రయాణికులకు చికిత్స అందించారు.