మరో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో 150 కార్లు | Fire Accident In Chennai At Car Parking | Sakshi
Sakshi News home page

మరో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో 150 కార్లు

Feb 24 2019 3:36 PM | Updated on Feb 24 2019 6:16 PM

Fire Accident In Chennai At Car Parking - Sakshi

సాక్షి, చెన్నై: చెన్నై సమీపంలోని పోరూర్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చేటుచేసుకుంది. ఓ ప్రైవేటు కారు గోడౌన్‌లో భారీగా మంటలు వ్యాపించాయి. సుమారు 150కు పైగా కార్లు  మంటల్లో చిక్కుకున్నాయి. కొందరు వ్యక్తులు కూడా మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. భారీగా ఎగిసిపడుతున్న మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. ఘటనతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.  కార్లలోని ఇంధనం అగ్నికి ఆజ్యం పోసింది. ఎగిసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ పరిసర ప్రాంతాల్లో వ్యాపించడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా శనివారమే బెంగళూరులో జరిగిన అగ్ని ప్రమాదంలో 150కు పైగా కార్లు బుగ్గిపాలైన విషయం తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement