ఆర్థిక ప్యాకేజీ సిద్ధమా? ఆర్థికమంత్రి ప్రెస్ మీట్  | Finance Minister Nirmala Sitharaman to brief the media at 1pm today | Sakshi
Sakshi News home page

ఆర్థిక ప్యాకేజీ సిద్ధమా? ఆర్థికమంత్రి ప్రెస్ మీట్ 

Mar 26 2020 12:17 PM | Updated on Mar 26 2020 12:20 PM

Finance Minister Nirmala Sitharaman to brief the media at 1pm today - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  కరోనాపై  21 రోజుల పోరు కొనసాగుతున్న తరుణంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి మీడియా ముందుకు రాన్నారు. గురువారం మధ్యాహ్నం 1 గంటకు  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడన్నారు. ఆర్థిక ప్యాకేజీ సిద్ధమవుతోందనీ, త్వరలోనే వివరాలను ప్రకటించనున్నామని ఇప్పటికు నిర్మలా  సీతారామన్ ప్రకటించారు. దేశంలో లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలకు ఇప్పటికే పలు విషయాల్లో నిబంధనలను సడలించిన ఆర్థికమంత్రి తాజా సమావేశంపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ వార్తల నేపథ్యంలో మార్కెట్లు దృఢంగా కొనసాగుతున్నాయి. ఉపశమన చర్యలతో దేశ ప్రజలకు  భారీ ఊరట లభించనుందన్న వార్తలతో  స్టాక్ మార్కెట్ దూసుకుపోతోంది. సెన్సెక్స్ ఏకంగా  15 పాయింట్లకు పైగా ఎగిసి 30వేల స్థాయిని అధిగమనించింది. నిఫ్టీ కూడా 400 పాయింట్లు పుంజుకుని 8700  స్థాయిని దాటి  ట్రేడ్ అవుతోంది.  (ఆర్థిక ప్యాకేజీ ప్రకటనకు కేంద్రం సిద్ధం!)

కాగా కరోనా ప్రకంపనలు దేశ వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. దేశంలో ఇప్పటికే 649 పాజిటివ్ కేసులు నమోదుగా కాగా 13  మరణాలు సంభవించాయి. ముఖ్యంగా అత్యధికంగా 124  పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర డేంజర్ జోన్ లో కొనసాగుతోంది.  తరువాత కేరళ, కర్ణాటక, తెలంగాణా రాష్ట్రాలు ఉన్నాయి. (కరోనా రిలీఫ్ : పన్ను చెల్లింపుదారులకు గుడ్న్యూస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement