'మా కూతురు చనిపోయింది.. కర్మకు రండి' | a family done final rituals to their daughter even she live | Sakshi
Sakshi News home page

'మా కూతురు చనిపోయింది.. కర్మకు రండి'

Feb 22 2018 7:09 PM | Updated on Feb 22 2018 7:09 PM

a family done final rituals to their daughter even she live - Sakshi

అంత్యక్రియలు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి (ప్రతీకాత్మక చిత్రం)

సాక్షి, వేలూరు : ప్రియుడితో వెళ్లిపోయిందన కోపంతో ఓ తండ్రి తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. తన కుమార్తె చనిపోయిందంటూ పోస్టర్లు వేయించి మరీ అంత్యక్రియలు నిర్వహించడాడు. ఈ సంఘటన వానియంబాడి సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వేలూరు జిల్లా వానియంబాడి సమీపంలోని ఒక గ్రామంలో ఓ యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. వారి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో గత నెల 23 న ఆ యువతి ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రియుడిని వివాహం చేసుకుంది.

దీంతో ఆగ్రహించిన యువతి తల్లిదండ్రులు ఇకపై తమ కుమార్తెతో తమకు ఎలాంటి సంబంధాలు లేదని, తమ కూతురు చచ్చినట్లేనని ప్రకటించారు. అయితే, చుట్టుపక్కల వారు వారి ప్రేమ వివాహాన్ని ఎక్కువగా చర్చించుకుంటుండటంతో ఏకంగా ఆమె చనిపోయిందని ఊరినిండా పోస్టర్లు వేయించాడు. ఆ పోస్టర్‌లో తన కుమార్తె జనవరి 23న మృతి చెందిందని, ఆరోజే దహన క్రియలు చేశామని ఫిబ్రవరి 21న తేదిన అంత్యక్రియలని పేర్కొన్నారు. పోస్టర్‌లో పేర్కొన్న ప్రకారమే గ్రామస్తులు, బందువులతో కలిసి కుటుంబ సభ్యులు కుమార్తెకు అంత్యక్రియలు జరిపారు. ఆన్‌లైన్‌, డిజిటల్‌ రంగం వచ్చిన నేటి రోజుల్లో వారి చర్యలు సంచలనంగా మారాయంటూ పలువురు చర్చించుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement