నేడు సమరాంగణంగా వారణాసి | Election campaign in Varanasi | Sakshi
Sakshi News home page

నేడు సమరాంగణంగా వారణాసి

Mar 4 2017 1:50 AM | Updated on Aug 21 2018 9:33 PM

నేడు సమరాంగణంగా వారణాసి - Sakshi

నేడు సమరాంగణంగా వారణాసి

ప్రధాని మోదీ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి శనివారం రాజకీయ దిగ్గజాల ప్రచారంలో సమరాంగణంగా మారనుంది.

మోదీ, రాహుల్, మాయావతి ప్రచారం
వారణాసి: ప్రధాని మోదీ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి శనివారం రాజకీయ దిగ్గజాల ప్రచారంలో సమరాంగణంగా మారనుంది. మోదీ, ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్, బీఎస్పీ అధినేత్రి మాయావతిలు ప్రచారంతో హోరెత్తించనున్నారు.

వీరందరూ ఒకేరోజు పర్యటనకు రానుండడంతో అధికారులు ఠారెత్తిపోతున్నారు. షెడ్యూలు ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు రానున్న మోదీ మొదట కాశీవిశ్వనాథ ఆలయానికి వెళ్తారు. తర్వాత బెనారస్‌ వర్సిటీలో విశ్రాంతి తర్వాత కాశీ విద్యాపీఠ్‌ వర్సిటీకి వెళ్లి  ఎన్నికల సభలో ప్రసంగిస్తారు. అఖిలేశ్, రాహుల్‌లు కచేరీ ప్రాంతం నుంచి గిరిజాఘర్‌ వరకు రోడ్‌షో చేస్తారు. మాయావతి రొహానియాలో ర్యాలీ నిర్వహిస్తారు. మోదీ ఆదివారం కూడా వారణాసిలో ప్రచారంలో పాల్గొనే అవకాశముందని బీజేపీ వర్గాలు తెలిపాయి.

Advertisement
 
Advertisement
Advertisement