న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సతీమణి ఎంపీ డింపుల్ యాదవ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాక్రోజ్ జనతా పార్టీ (సీజేపీ) మద్దతుదారులు, ప్రజాస్వామిక వాదులు.. ఆమెను ప్రశంసిస్తున్నారు. విద్యార్థుల ఉద్యమంలో ఆమె చూపించిన తెగువ, మానవత్వం అందరినీ ఆకట్టుకుంది. యువతపై పోలీసుల దాడులను ధైర్యంగా ప్రశ్నించారు. ముఖ్యంగా యువతులపై పోలీసుల దాష్టీకాన్ని నిలదీశారు. పోలీసుల దాడిలో గాయపడిన వారికి సఫర్యలు చేసి అమ్మగా ఆదరించారు. భయంతో వణికిపోతున్న చిన్న పిల్లలను ప్రేమగా దగ్గరకు తీసుకుని భరోసా కల్పించారు.
సీజేపీ పిలుపు మేరకు సోమవారం ఆమె తన పార్టీ నాయకులతో కలిసి చలో సంసద్ ఆందోళన కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. విద్యార్థులకు మద్దతుగా ర్యాలీలో చురుగ్గా పాల్గొన్నారు. పోలీసులు, భద్రతా సిబ్బంది అడుగడుగునా అడ్డుపడినా ముందుకు సాగారు. విద్యార్థులకు నైతిక స్థైర్యాన్ని ఇచ్చి తాను కూడా వారితో పాటు ఆందోళనలో భాగమయ్యారు. యువత పట్ల నిర్దయగా వ్యహరించిన పోలీసుల తీరును గర్హించారు. పోలీసులు గూండాల్లా వ్యవహరించారని ధ్వజమెత్తారు. భారత చరిత్రలో ఇంత అహంకారపూరితమైన, క్రూరమైన ప్రభుత్వాన్ని ఎన్నడూ లేదని మండిపడ్డారు. మంగళవారం నాడు కూడా సీజేపీ పోరాటానికి సంఘీభావం ప్రకటించారు.
డింపుల్ వీడియోలు వైరల్
కాక్రోజ్ జనతా పార్టీ పోరాటంలో డింపుల్ యాదవ్ పాల్గొన్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు చూసిన వారంతా ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నాయకులు ఎప్పుడూ ప్రజల పక్షాన ఉండాలని కోరుతున్నారు. కాగా, బీజేపీ మద్దతుదారులు మాత్రం డింపుల్ యాదవ్‌పై విమర్శలు చేస్తున్నారు. ఓట్ల కోసమే ఆమె ఇదంతా చేస్తున్నారని ట్రోల్ చేస్తున్నారు.
एक मां ही अपने बच्चों का दर्द समझ सकती है। pic.twitter.com/kKvh8P4D2c
— Luffy (@luffyspeaking) July 20, 2026
అఖిలేశ్ యాదవ్ అరెస్ట్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ నివాసం వద్ద ధర్నాకు దిగిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ను పోలీసులు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, ఎంపీ ప్రియాంక గాంధీతో పాటు పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. అఖిలేశ్ యాదవ్ అరెస్ట్‌ను సమాజ్‌వాదీ పార్టీ ఖండించింది. మోదీ సర్కారు నిరంకుశంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడింది.
छात्रों के समर्थन में समाजवादी हुंकार
नहीं चलेगी ये युवा विरोधी सरकार pic.twitter.com/cE0L4fnqFA— Samajwadi Party (@samajwadiparty) July 21, 2026


