జమిలిపై తేల్చేసిన ఈసీ

EC Clarifies its Not possible to hold simultaneous elections next year - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్‌, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా లా కమిషన్‌కు లేఖ రాసిన మరుసటి రోజే జమిలి ఎన్నికలు సాధ్యం కాదని ఎన్నికల కమిషన్‌ (ఈసీ) చేతులెత్తేసింది. జమిలి ఎన్నికల నిర్వహణకు అవసరమైన సాధనా సంపత్తి తమ వద్ద లేవని స్పష్టం చేసింది.

వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలతో పాటే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడం సాధ్యం కాదని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఓపీ రావత్‌ మంగళవారం పేర్కొన్నారు.జమిలి ఎన్నికలకు సరిపడినన్ని వీవీపాట్‌ యంత్రాలు తమ వద్ద లేవని అన్నారు. కాగా దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా సోమవారం లా కమిషన్‌కు లేఖ రాశారు.

రాష్ట్రాల్లో ఏడాది పొడవునా ఎన్నికలు జరుగుతుంటే అభివృద్ధి పనులకు అవరోధం ఏర్పడుతున్నదని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. తరచూ ఎన్నికలతో పెద్దసంఖ్యలో అధికారులు, సిబ్బందిని ఎన్నికల విధుల్లో నిమగ్నం చేయడంతో ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడుతోందన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top