ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించకపోవడంతో కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ నవ వధువు తన భర్తకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది.
పాట్నా: ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించకపోవడంతో కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ నవ వధువు తన భర్తకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆరు బయటకు వెళ్లినప్పుడు తన గౌరవానికి ఇబ్బంది కలుగుతుందని, వెంటనే ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించాలని గత కొద్దికాలంగా చెప్తూ వస్తోంది. అయిన తన భర్త పెడచెవిన పెట్టడంతో అతడిని పంచాయతీకి ఈడ్చింది.
బిహార్ లోని ఖోతవా అనే గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 'నేను చాలా రోజులుగా ఆరు బయటకు వెళ్లాల్సి వస్తోంది. చీకటిని ఆశ్రయించాల్సి వస్తోంది. ఆ పొలం యజమాని నన్ను ఎన్నోసార్లు అవమానించాడు. మీ అమ్మానాన్నలకు చెప్పి టాయిలెట్ కట్టించాలని చెప్పండని నేను ఎన్నోసార్లు చెప్పాను. అయినా వినలేదు. అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నాను' అని పంచాయతీలో చెప్పింది.