న్యూఢిల్లీ: తనను ఇంటర్నల్ లోక్పాల్ నుంచి తొలగిస్తున్నట్లు ముందే చెప్తే బావుండేదని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అడ్మిరల్ ఎల్ రామ్ దాస్ అన్నారు.
న్యూఢిల్లీ: తనను ఇంటర్నల్ లోక్పాల్ నుంచి తొలగిస్తున్నట్లు ముందే చెప్తే బావుండేదని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అడ్మిరల్ ఎల్ రామ్ దాస్ అన్నారు. తనకు తెలియకుండా పార్టీ అధిష్టానం ఇలా నిర్ణయించడం చాలా బాధాకరంగా ఉందని, దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పారు. గతంలో అనధికారికంగా జరిగిన ఓ సమావేశంలో తనను మరో ఐదేళ్లపాటు కొనసాగాల్సిందిగా వారే కోరారని చెప్పారు. వివిధ వార్తా చానెళ్లలో ఈ వార్తలు రావడం చూసి తనకు ఆశ్చర్యం వేసిందని, అనంతరం కొంత బాధకలిగిందని.. అయినా, ఫోన్ కాల్ కోసం ఎదురుచూశానని తెలిపారు. ఆప్లో పరిణామాలు తీవ్రంగా బాధించాయని అన్నారు.