కోలుకుంటున్ననటుడు దిలీప్ కుమార్ | Dilip Kumar stable, to be discharged soon | Sakshi
Sakshi News home page

కోలుకుంటున్న నటుడు దిలీప్ కుమార్

Sep 21 2013 9:42 PM | Updated on Apr 3 2019 6:23 PM

గుండెపోటుతో బాధపడుతూ గత ఆదివారం ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్‌కుమార్ కోలుకుంటున్నారు.

ముంబై : గుండెపోటుతో బాధపడుతూ గత ఆదివారం ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్‌కుమార్ కోలుకుంటున్నారు. మరోవారంలో అతడిని డిశ్చార్జీ చేస్తామని శనివారం ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ‘దిలీప్‌కుమార్ త్వరగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగుపడింది.

 

మరో రెండు రోజులపాటు అతడిని ఐసీయూలోనే ఉంచుతాం.. అతడిని వచ్చేవారం డిశ్చార్జి చేసే అవకాశముంది..’ అని అతడికి చికిత్స అందిస్తున్న లీలావతి ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. కాగా దిలీప్‌కుమార్‌కు ఆస్పత్రిలో రెండు రోజులుగా పరామర్శల తాకిడి పెరిగింది. బాలీవుడ్ నటులు షబానాఅజ్మీ, ఫరీదా జలాల్,ఆషా పరేఖ్, రజా మురద్ తదితరులు వచ్చి పరామర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement