అభివృద్ధికి ఆ రాష్ట్రాలే కీలకం... | Development of north-east must for overall growth: Amit Shah | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి ఆ రాష్ట్రాలే కీలకం...

Published Tue, Sep 5 2017 4:25 PM | Last Updated on Mon, May 28 2018 4:01 PM

అభివృద్ధికి ఆ రాష్ట్రాలే కీలకం... - Sakshi

అభివృద్ధికి ఆ రాష్ట్రాలే కీలకం...

సుదీర్ఘ కాంగ్రెస్‌ పాలనతో పోలిస్తే ఈశాన్య రాష్ట్రాల్లో మోదీ హయాంలోనే ఎక్కువ అభివృద్ధి జరుగుతున్నదని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు.

 న్యూఢిల్లీః సుదీర్ఘ కాంగ్రెస్‌ పాలనతో పోలిస్తే ఈశాన్య రాష్ట్రాల్లో  మోదీ హయాంలోనే ఎక్కువ అభివృద్ధి జరుగుతున్నదని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని చెప్పారు. దేశ అభివృద్ధికి ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల్లో వృద్ధి అనివార్యమన్నారు. ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌ఈడీఏ) సదస్సులో అమిత్‌ షా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌తో భూ సరిహద్దు ఒప్పందం ఈ ప్రాంత అభివృద్ధిలో మైలురాయి వంటిదని పేర్కొన్నారు. 
 
ఎన్‌ఈడీఏ రాజకీయ వేదికే కాకుండా ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల సంస్కృతికి ప్రతీకగా ఆయన అభివర్ణించారు. తదుపరి ఎన్‌ఈడీఏ భేటీలో ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఈ సమావేశానికి అస్సాం, మణిపూర్‌, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌ సీఎంలు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement