అక్కడ అందరూ ఆడదొంగలే! | Delhi's pickpockets are mostly women | Sakshi
Sakshi News home page

అక్కడ అందరూ ఆడదొంగలే!

May 3 2014 1:51 PM | Updated on Oct 16 2018 5:04 PM

అక్కడ అందరూ ఆడదొంగలే! - Sakshi

అక్కడ అందరూ ఆడదొంగలే!

దేశ రాజధానిలో పిక్ పాకెటర్లలో 94 శాతం మంది ఆడవాళ్లేనట.

దేశ రాజధానిలో పిక్ పాకెటర్లలో 94 శాతం మంది ఆడవాళ్లేనట. గత ఆరు నెలల్లో ఢిల్లీ మెట్రో రైళ్లలో జేబులు కత్తిరించే కేసుల్లో దొరికిన వారిలో ఎక్కువ మంది మహిళలే. బాధితుల్లోనూ మహిళలే ఎక్కువ. 
 
ఢిల్లీలో రౌడీలు, రైల్ పెట్టె రోమియోల బాధను తప్పించుకునేందకు మహిళలు ఎక్కువగా స్త్రీలకు కేటాయించిన పింక్ కంపార్ట్ మెంట్లలో ఎక్కుతున్నారు. అయితే అక్కడ రోమియోలు, రౌడీల బాధ లేదు కానీ, లేడీ పిక్ పాకెటర్ల బెడద ఎక్కువైపోయింది.
 
ఢిల్లీ మెట్రోలో గత ఆర్నెల్లలో అరెస్టైన 126 మంది పిక్ పాకెటర్లలో 118 మంది లేడీ కిలాడీలేనట. గతేడాది కూడా ఢిల్లీ మెట్రోలో 193 మంది పిక్ పాకెటర్లు పట్టుబడ్డారు. వీరిలో 91 శాతం మంది ఆడవాళ్లే. 
 
వీరంతా అద్దిరిపోయే ఇంగ్లీషులో మాట్లాడేస్తున్నారట. లాప్ టాపులు భుజాన వేసుకుని, అత్యాధునికంగా డ్రస్సులేసుకుని అదరగొట్టేస్తున్నారట. అనుమానం వచ్చినా అడగలేనంత మోడర్న్ గా ఉండటంతో వారంతా దొరికే దాకా దొరసానులే!

Advertisement
 
Advertisement
Advertisement