ఢిల్లీలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర | Delhi Police Alert After Intel Waring Of Terrorists Entering State | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర

Oct 3 2019 11:38 AM | Updated on Oct 3 2019 12:29 PM

Delhi Police Alert After Intel Waring Of Terrorists Entering State - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్రపన్నారు. జైషే మహ్మద్‌ సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులో ఢిల్లీలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు సమచారం అందించాయి. దీంతో ఢిల్లీ పోలీసులు అలర్ట్‌ అయ్యారు. ఢిల్లీ స్పెషల్‌ సెల్‌కు చెందిన బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి. తొమ్మిది ప్రాంతాలతో సోదాలు నిర్వహించారు. రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, మార్కెట్‌ ప్రాంతాలలో పకడ్బందీగా సోదాలు నిర్వహిస్తున్నారు.

(చదవండి : ‘భారత్‌లో ఉగ్రదాడులు జరగొచ్చు’)

ఇటీవల ఢిల్లీకి వచ్చిన ఇతర ప్రాంతాల వారి వివరాలు సేకరిస్తున్నారు. హోటళ్లలో తనిఖీలు చేపట్టి కొత్తగా గదులు బుక్‌ చేసుకున్నవారిపై ఆరా తీస్తున్నారు. అలర్ట్‌గా ఉండాలని 15 జిల్లాల డీసీపీలకు పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేశారు. పేలుడు పదార్థాలలో ఉగ్రవాదులు రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని నేషనల్‌ కాపిటల్‌ రీజియన్‌ పరిధిలో హై అలర్ట్‌ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement