ముంబైని మించిన ఢిల్లీ! | Delhi, not Mumbai, India's economic capital | Sakshi
Sakshi News home page

ముంబైని మించిన ఢిల్లీ!

Nov 29 2016 8:26 PM | Updated on Sep 4 2017 9:27 PM

ముంబైని మించిన ఢిల్లీ!

ముంబైని మించిన ఢిల్లీ!

దేశ ఆర్థిక రాజధానిగా పేర్గాంచిన ముంబై స్థానాన్ని త్వరలోనే ఢిల్లీ ఆక్రమించే సూచనలు కనిపిస్తున్నాయి.

సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రాజధానిగా పేర్గాంచిన ముంబై స్థానాన్ని త్వరలోనే ఢిల్లీ ఆక్రమించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ జారీ చేసిన  2015 డేటా ప్రకారం ప్రపంచంలోని అతి పెద్ద 50 ఆర్థిక నగరాల జాబితాలో ఢిల్లీకి 30,  ముంబైకి 31వ స్థానం లభించాయి. గురుగ్రామ్, నోయిడా, ఘాజియాబాద్, ఫరీదాబాద్‌ వంటి నగరాలతో కలిపి ఢిల్లీ– ఎన్సీఆర్‌ జీడీపీ 370 వందల కోట్ల డాలర్లు (రూ.25,164,00  కోట్లు) అని నివేదిక పేర్కొంది.

ముంబై, నవీ ముంబై, థానే, వసై, వీరార్, భీవండి, పన్వేల్‌ ప్రాంతాలతో కూడిన ముంబై మెట్రోపాలిటన్‌ నగరం జీడీపీ 368 వందల డాలర్లని తెలిపింది. 2030 నాటికి ప్రపంచంలోని అతిపెద్ద నగరాల జాబితాలో ఢిల్లీ 11, ముంబై 14వ స్థానంలో ఉంటాయని వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement