పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన సీపీఎం ఇప్పుడు పశ్చాత్తాపపడుతోంది.
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన సీపీఎం ఇప్పుడు పశ్చాత్తాపపడుతోంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌తో జత కట్టి లయతప్పామని పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం అభిప్రాయపడింది. సోమవారం ఇక్కడ జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో ఇటీవల పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ జయాపజయాలపై సమీక్షించారు.


