భారత్‌లో కొత్తగా 9,851 కేసులు | Corona In India latest Update: 9851 New Cases Registered | Sakshi
Sakshi News home page

కరోనా రికార్డు: భారత్‌లో కొత్తగా 9,851 కేసులు

Jun 5 2020 10:10 AM | Updated on Jun 5 2020 11:08 AM

Corona In India latest Update: 9851 New Cases Registered - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి కేసులు సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మరణాలు కూడా ప్రతి రోజు 200 పైగా సంభవిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే దాదాపు 10 వేల కేసులు వెలుగుచూశాయి. గడిచిన 24 గంటల్లో 9,851 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా, 273 మంది మృత్యువాత పడ్డారు. ఒకేరోజు ఈ సంఖ్యలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. దీంతో ఇప్పటి వరకు దేశంలో 2,26,770 కరోనా కేసులు నమోదవ్వగా.. 6,348 మంది ప్రాణాలు విడిచారు. కరోనా నుంచి కోలుకొని 1,09,462 మంది డిశ్చార్జి అయ్యారు. (కరోనా చికిత్సకు తాజా మార్గదర్శకాలు)

ఇక కోవిడ్‌ కేసులు నమోదయిన దేశాల్లో భారత్‌ 7వ స్థానంలో నిలిచింది. మొదటి ఆరు స్థానాల్లో వరుసగా అమెరికా, బ్రెజిల్‌, రష్యా, యూకే, స్పెయిన్‌, ఇటలీ ఉన్నాయి. అదే విధంగా మరణాల విషయానికొస్తే భారత్‌ 12వ స్థానంలో ఉంది. కరోనా నుంచి కోలుకుంటున్న వారిలో 8వ స్థానంలో కొనసాగుతోంది. (తెలంగాణలో 3147 కరోనా కేసులు)

15 రోజుల్లోనే రెట్టింపు అవుతున్న కరోనా కేసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement