
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 127 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3147కి చేరింది. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 110, రంగారెడ్డిలో 6, ఆదిలాబాద్ జిల్లాలో 7 , మేడ్చల్ 2, సంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ఒకటి చొప్పున నమోదయ్యాయని ప్రజారోగ్య విభాగం సంచాలకుడు డాక్టర్ శ్రీనివాస్‌రావు గురువారం మీడియా బులెటిన్‌లో వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్‌తో ఆరుగురు మరణించగా మొత్తం మృతుల సంఖ్య 105కి చేరింది. కాగా కరోనా నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1587కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1455 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో ఒక్కరోజే 123 మంది మృతి