‘సోనియా గాంధీ మీ టిక్కెట్లకు డబ్బు చెల్లించారు’

Congress MLA Tells Migrants Sonia Gandhi Paid For Your Tickets Punjab - Sakshi

కరపత్రాలు పంచిన కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రాజా వారింగ్‌

చండీగఢ్‌: లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి కోల్పోయి పేదలు అల్లాడుతుంటే.. కొంతమంది నాయకులు మాత్రం ఈ కష్టకాలంలోనూ రాజకీయాలే పరమావధిగా పనిచేస్తున్నారు. ప్రజల ఇబ్బందులతో తమకు పనిలేదన్నట్లుగా రాజకీయ లబ్దికోసం వెంపర్లాడుతున్నారు. లాక్‌డౌన్‌తో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను శ్రామిక్‌ రైళ్ల ద్వారా సొంత రాష్ట్రాలకు తరలిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం పంజాబ్‌లోని భాటిండా స్టేషన్‌ నుంచి వలస కార్మికులతో ప్రత్యేక రైలు బిహార్‌కు బయల్దేరేందుకు సిద్ధమైంది. ఇంతలో అక్కడికి చేరుకున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అమరీందర్‌ సింగ్‌ రాజా వారింగ్‌ కరపత్రాలు పంచిపెట్టడం ప్రారంభించారు. ‘‘మీ రైల్వే టిక్కెట్లకు సోనియా గాంధీ డబ్బు చెల్లించారు’’ అంటూ వారికి పాంప్లెంట్లు అందించారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మీ ప్రయాణ చార్జీలు చెల్లించారు. కాంగ్రెస్‌ పార్టీ, ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌, సునిల్‌ జఖార్‌ మిమ్మల్ని పంపిస్తున్నారు. ఈ పాంప్లెంట్‌లో అంతా రాసి ఉంది. ప్రయాణంలో మీకు తీరిక ఉన్నపుడు చదవండి’’ అని రాజా వారింగ్‌ వలస కార్మికులతో పేర్కొన్నారు. (ప్రత్యేక రైళ్లు: తాజా మార్గదర్శకాలు)

కాగా లాక్‌డౌన్‌తో ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల తరలింపు విషయంలో రాజకీయ దుమారం రేగిన విషయం తెలిసిందే. వలస కార్మికులను స్వస్థలాలకు కేంద్రమే ఉచితంగా చేర్చాలని కొన్ని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేయగా.. వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు అయ్యే ఖర్చును తాము భరిస్తామంటూ కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా చేసిన ప్రకటన చేశారు. అదే విధంగా పీఎం–కేర్స్‌ నిధులను కార్మికుల కోసం వెచ్చించాలని సీపీఎం డిమాండ్‌ చేసింది. విపక్షం వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికార బీజేపీ.. వలస కార్మికుల టికెట్‌ ఖరీదులో రైల్వేలు 85 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు మిగతా మొత్తాన్ని భరిస్తున్నాయని స్పష్టం చేసింది. రైల్వే శాఖ సైతం ఈ విషయంలో రాజకీయాలు చేయవద్దని హితవు పలికింది. ప్రస్తుతం రాజా వారింగ్‌ చర్యపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.(అమాంతం పెరిగిన క‌రోనా కేసులు.. వారి వ‌ల్లే)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

08-05-2021
May 08, 2021, 19:32 IST
ముంబై: టీమిండియా ఆటగాడు అజింక్య ర‌హానే క‌రోనా టీకా తీసుకున్నాడు. త‌న స‌తీమ‌ణి రాధిక‌తో క‌లిసి ముంబైలోని క‌రోనా వ్యాక్సిన్ కేంద్రంలో...
08-05-2021
May 08, 2021, 19:22 IST
సాక్షి, అమరావతి : గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1,01,571 కరోనా పరీక్షలు నిర్వహించగా 20,065 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది....
08-05-2021
May 08, 2021, 18:44 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేకుండా చూస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.కరోనా రోగులకు...
08-05-2021
May 08, 2021, 18:01 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ కట్టడికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 మంది సభ్యులతో టాస్క్‌ఫోర్స్‌...
08-05-2021
May 08, 2021, 17:28 IST
భారత హాకీ దిగ్గజం, మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత హాకీ జట్టు సభ్యుడు రవీందర్ పాల్ సింగ్ (60)...
08-05-2021
May 08, 2021, 17:00 IST
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ అల్లకల్లోలాన్ని సృష్టించింది. వైరస్‌ ఇప్పటికీ కొన్ని దేశాల్లో తన ప్రభావాన్ని భీకరంగా చూపిస్తోంది. భారత్‌ లాంటి...
08-05-2021
May 08, 2021, 16:26 IST
హైదరాబాద్ లోని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో  ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఐఎన్‌ఎంఏఎస్‌ (ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్...
08-05-2021
May 08, 2021, 16:19 IST
న్యూఢిల్లీ: కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పలువురు ముఖ్యమంత్రులకు శనివారం ఫోన్‌ చేశారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌...
08-05-2021
May 08, 2021, 15:28 IST
రాగి జావ..కొర్ర బువ్వ..జొన్న రొట్టె.. ఇళ్లలో ఇప్పుడు ఇదే మెనూ. కుటుంబ సభ్యులంతా ఇష్టంగా తింటున్నారు. బయటి ఆహారానికి స్వస్తి...
08-05-2021
May 08, 2021, 15:20 IST
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌లో తీవ్రంగా విస్తరిస్తోంది.మరోవైపు ఇప్పటికే దేశంలో కోవీషీల్డ్‌, కోవాగ్జిన్‌, స్పుత్నిక్-వి అనే మూడు...
08-05-2021
May 08, 2021, 15:07 IST
ముంబై: కరోనా సెకండ్ వేవ్‌ విజృంభణ నేపథ్యంలో వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ రంగ దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌...
08-05-2021
May 08, 2021, 15:01 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా శనివారం నుంచి రెండో డోసు వేసుకునే లబ్ధిదారులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు రాష్ట్ర...
08-05-2021
May 08, 2021, 14:55 IST
హిమాచల్‌ ప్రదేశ్‌లో ఏకంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, బాలీవుడ్‌ మెగాస్టార్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ల...
08-05-2021
May 08, 2021, 14:04 IST
థర్డ్‌ వేవ్‌ కూడా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నప్పుడు హటాత్తుగా ఆకాశం మేఘావృతమై ఓ చినుకు రాలినట్లుగా వినిపించిన మాట ఇది!...
08-05-2021
May 08, 2021, 13:56 IST
లండన్‌: గత సంవత్సర కాలంగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అల్లాడిస్తోంది. ఇటీవలే కొన్ని దేశాలు ఈ వైరస్‌ బారినుంచి మెల్లగా కోలుకుంటున్నాయి....
08-05-2021
May 08, 2021, 13:10 IST
సాక్షి,న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ సోకిన తరువాత కోలుకోవడం ఒక ఎత్తయితే.. కోలుకున్న తరువాత మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం మరో ఎత్తు....
08-05-2021
May 08, 2021, 11:06 IST
సాక్షి, హైదరాబాద్‌: ఒకవైపు కరోనా కేసులు పెరుగుతుంటే.. మరో వైపు వ్యాక్సిన్ల కార్యక్రమం మందగిస్తోంది.. 16 కోట్ల కంటే ఎక్కువ మందికి...
08-05-2021
May 08, 2021, 08:36 IST
సాక్షి, సిటీబ్యూరో: ఇది రామంతాపూర్‌లోని వివేకానగర్‌ కాలనీలో వెలసిన వారాంతపు సంత. జనం గుంపుల కొద్దీ పోగయ్యారు. తిరునాళ్లను తలపించారు....
08-05-2021
May 08, 2021, 04:43 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి నెలకు ఒక కోటి కోవిడ్‌–19 టీకాలు ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీకి...
08-05-2021
May 08, 2021, 04:16 IST
కోవిడ్‌ కారణంగా ఆయా రాష్ట్రాల్లో చిత్రీకరణలకు వీలు కుదరకపోవడంతో చాలామంది తమ సినిమా షూటింగ్‌ను గోవాకు షిఫ్ట్‌ చేశారు. అక్కడి...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top