పటేళ్లకు రిజర్వేషన్లు, రైతు రుణమాఫీ | Congress manifesto focuses on youth, Patel reservation | Sakshi
Sakshi News home page

పటేళ్లకు రిజర్వేషన్లు, రైతు రుణమాఫీ

Dec 5 2017 4:10 AM | Updated on Jun 4 2019 5:16 PM

Congress manifesto focuses on youth, Patel reservation - Sakshi

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో పటేళ్లకు ప్రత్యేక కేటగిరీ కింద రిజర్వేషన్లు కల్పిస్తామని, ఓబీసీ కోటా వారికి వర్తించే అన్ని ప్రయోజనాలు అందేలా చూస్తామని గుజరాత్‌ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ ప్రకటించింది. అలాగే రైతు రుణ మాఫీతో పాటు కార్మికులకు రూ. 10కే పౌష్టికాహరం అందిస్తామంది. ఉన్నత కులాల్లో వెనకబడిన వారిని ఆర్థికంగా, విద్యాపరంగా ఆదుకునేందుకు ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ పేర్కొంది.

చదువుకున్న యువతకు నిరుద్యోగ భృతి, మహిళలకు ఎల్‌ఐజీ(తక్కువ ఆదాయ వర్గం) ఇళ్లు ఇవ్వడంతో పాటు పెట్రోల్‌ ,డీజిల్‌ ధరల్ని లీటరుకు రూ. 10 చొప్పున తగ్గిస్తామని రాష్ట్ర కాంగ్రెస్‌ ఎన్నికల ఇన్‌చార్జ్‌ అశోక్‌ గెహ్లోట్‌ సోమవారం విడుదల చేసిన మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్‌ ఉద్యోగాల్ని రద్దు చేస్తామని, రైతులకు 16 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement