ఆ కేసులో కాంగ్రెస్‌ ఐటీ సెల్‌ సభ్యుడి అరెస్ట్‌

Congress IT Cell Member Arrested On Molestation Accusations - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల కేసులో కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా టీమ్‌ సభ్యుడిని మంగళవారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాంగ్రెస్‌ ఐటీ సెల్‌లో పనిచేసే చిరాగ్‌ పట్నాయక్‌ తనను లైంగికంగా వేధించాడని గతంలో ఆయనతో కలిసి పనిచేసిన ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్నాయక్‌ను నార్త్‌ ఎవెన్యూ ప్రాంతంలో పోలీసులు అరెస్ట్‌ చేయగా అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. బాధితురాలు మేజిస్ర్టేట్‌ ఎదుట తన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన క్రమంలో నిందితుడిని అదుపుతోకి తీసుకున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

పట్నాయక్‌ సోషల్‌ మీడియా మేనేజర్‌గా ఉన్న సమయంలో బాధితురాలు కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా టీమ్‌లో సభ్యురాలిగా ఉన్నారు. నిందితుడు పలు సందర్భాల్లో తన పట్ల అమర్యాదకరంగా వ్యవహరించాడని, తన వ్యక్తిగత జీవితంలోకి చొచ్చుకువచ్చేలా ప్రవర్తించాడని ఢిల్లీ పోలీస్‌ కమీషనర్‌ అమ్యూ పట్నాయక్‌, ఇతర సీనియర్‌ అధికారులకు ఈమెయిల్‌లో ఫిర్యాదు చేశారు.

కాగా పట్నాయక్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంపై కాంగ్రెస్‌ పార్టీ డిజిటల్‌ మీడియా హెడ్‌ దివ్య స్పందన విస్మయం వ్యక్తం చేశారు. పట్నాయక్‌ను సమర్ధిస్తూ 39 మంది పార్టీ కార్యకర్తల సంతకాలతో కూడిన స్టేట్‌మెంట్‌ను ఆమె తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. వ్యక్తిగత, ఆరోగ్య కారణాలతోనే తాను టీమ్‌ నుంచి వైదొలగుతున్నట్టు ఫిర్యాదుదారు పేర్కొన్నారని చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top