కరుణానిధికి సినీతారల కన్నీటి నివాళి | Cine stars Tribute to the Karunanidhi | Sakshi
Sakshi News home page

కరుణానిధికి సినీతారల కన్నీటి నివాళి

Aug 9 2018 4:11 AM | Updated on Aug 9 2018 4:11 AM

Cine stars Tribute to the Karunanidhi - Sakshi

కరుణానిధి పార్థివ దేహం వద్ద నివాళులర్పిస్తున్న రజనీకాంత్, కమల్‌హాసన్

తమిళ సినిమా (చెన్నై): కరుణానిధి పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు సినీతారలు భారీగా తరలివచ్చారు. రజనీకాంత్, ఆయన సతీమణి లతా రజనీకాంత్, కూతురు ఐశ్వర్య, అల్లుడు, నటుడు ధనుష్‌ తదితరులు పుష్పాంజలి ఘటించారు. నటుడు, మక్కళ్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్, అజిత్, శాలిని దంపతులు, శివకుమార్, సూర్య, దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు, నటుడు విశాల్, నాజర్, ఇతర కార్యవర్గ సభ్యులు, ప్రభు, రామ్‌కుమార్, విక్రమ్‌ ప్రభు, టి.రాజేందర్, ప్రసన్న, స్నేహ, రాధా రవి, సత్యరాజ్, దర్శకుడు కె.భాగ్యరాజ్, గౌండ్రమణి, వివేక్, పార్తీపన్, సిబి రాజ్, శివకార్తీకేయన్, విజయ సేతుపతి, అధర్వ, నందా, బాబీ సింహా, పశుపతి, ఆర్‌కే.సురేశ్, మన్సూర్‌ అలీఖాన్, శ్రీమాన్, విమల్, పా.విజయ్, సంతానభారతి, నటి సరోజాదేవి,కోవై సరళ, దర్శకుడు ఎస్‌పీ.ముత్తురామన్, పి.వాసు, కేఎస్‌.రవికుమార్‌ తదితరులు నివాళులర్పించారు. విదేశాల్లో షూటింగ్‌లో ఉన్న నటుడు విజయ్, విక్రమ్, దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్, సంగీత దర్శకుడు రెహమాన్, దర్శకుడు శంకర్‌ ట్విట్టర్‌ ద్వారా సంతాపం ప్రకటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement