నాగుపాముపై పగ... | Chhattisgarh: Farmer ties snake to pole for biting him | Sakshi
Sakshi News home page

నాగుపాముపై పగ...

Jul 11 2016 4:04 PM | Updated on Oct 1 2018 2:44 PM

తనను కాటేసిన పాము పగబట్టాడో రైతు. ఆ విష సర్పాన్ని వెంటాడి మరీ పట్టుకుని దానికి శిక్ష వేసిన వైనం ఆశ్యర్యకరంగా మారింది.

రాయ్‌పూర్ : పాము పగపడుతుందనేది  నానుడి.  కానీ  తనను కాటేసిన పాము పగబట్టాడో రైతు. ఆ  విష సర్పాన్ని వెంటాడి మరీ పట్టుకుని దానికి  శిక్ష వేసిన వైనం ఆశ్చర్యకరంగా మారింది. పాము కనిపించగానే బెంబేలెత్తిపోవడం.. పారిపోవడం కామన్.  లేదంటే దాన్ని చంపడమో లేక పాములు పట్టేవారికి సమాచారం ఇవ్వడమో కూడా తెలిసిందే. అయితే చత్తీస్ ఘడ్ లోని ఓ రైతు వీటికి భిన్నంగా ప్రవర్తించాడు.

ఛత్తీస్‌గఢ్ కోబ్రా జిల్లాలోని లహంగ్ బహారా  గ్రామంలో నాగుపాముకు   శిక్ష వేసిన ఘటన ఆదివారం  చోటు చేసుకుంది. లహరి లాల్ అనే రైతు తన పంట పొలంలో పని చేసుకుంటుండగా  ఓ నాగుపాము అతడిని  కాటేసింది. అంతే..లహర్ కు  ఎక్కడి లేని కోపం ముంచుకువచ్చింది.  కోపంతో ఊగిపోయాడు.  కాటేసిన బాధ మరిచి పాముపై కోపం పెంచుకున్నాడు . దాన్ని ఎలాగైనా పట్టుకొని తీరాలనే పట్టుదలతో దాన్ని వెంబడించాడు.  ఎట్టకేలకు సర్పాన్ని పట్టుకున్నాడు లాల్.   తన ఇంటికి  తీసుకువచ్చి తాడుతో స్తంభానికి కట్టేశాడు. దీంతో విస్తుపోయిన పాము కూడా  యథావిధిగా పడగెత్తి బుసకొట్టింది.


 

Advertisement
 
Advertisement
Advertisement