మెట్రో రూల్స్‌.. ఆ పని చేస్తే రూ. 200 ఫైన్‌ | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 5 2017 9:20 PM

Chewing Gum Pan Gutka banned in Namma Metro - Sakshi

సాక్షి, బెంగళూర్‌ : మెట్రో రైల్‌ రవాణా వ్యవస్థను పరిశుభ్రంగా ఉంచే చర్యలో భాగంగా బెంగళూర్‌ ‘నమ్మ మెట్రో’ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది.  స్టేష‌న్లలో, రైళ్లలో పాన్‌, గుట్కా, చూయింగ్ గ‌మ్‌లను తినడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అతిక్రమణ ఉల్లంఘిస్తే 200 రూపాయల ఫైన్‌ విధించనున్నట్లు తెలిపింది.

ప్రయాణికులు చూయింగ్ గ‌మ్‌లు తిని, వాటిని రైళ్లలో, స్టేష‌న్లలో ఎక్కడపడితే అక్కడ అంటిస్తున్నారు. పాన్లు, గుట్కాలను నమిలి ఎక్కడపడితే అక్కడ ఉమ్మేస్తున్నారు. భద్రతా సిబ్బంది పర్యవేక్షిస్తున్న ఆ ఆగడాలను కట్టడి చేయలేకపోతున్నాం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం అని న‌మ్మ మెట్రో అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

మెట్రో ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత‌ల‌ను ప్రయాణికులందరిపై ఉందని.. అది మరిచి పారిశుద్ధ్యాన్ని దెబ‍్బతీసేవారికి ఇది గుణపాఠమౌతుందని పలువురు ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Advertisement