యూపీ ఎన్నికల్లో భారీగా నగదు పట్టివేత | Capture a huge cash UP polls | Sakshi
Sakshi News home page

యూపీ ఎన్నికల్లో భారీగా నగదు పట్టివేత

Feb 27 2017 2:42 AM | Updated on Aug 14 2018 5:02 PM

యూపీ ఎన్నికల్లో భారీగా నగదు పట్టివేత - Sakshi

యూపీ ఎన్నికల్లో భారీగా నగదు పట్టివేత

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌ రాష్ట్రాల్లో 2012తో పోలిస్తే 2017 ఎన్నికల్లో ధన, మద్య ప్రవాహం భారీగా పెరిగింది.

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌ రాష్ట్రాల్లో 2012తో పోలిస్తే 2017 ఎన్నికల్లో ధన, మద్య ప్రవాహం భారీగా పెరిగింది. యూపీలో 2012లో రూ.36.29 కోట్ల నగదు, రూ.6.61 లక్షల విలువైన 3,073 లీటర్ల మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకోగా ఈసారి ఏకంగా రూ.115.7 కోట్ల నగదు, రూ.57.69 కోట్ల విలువైన 20.29 లక్షల బ్యారెళ్ల మద్యం, రూ.7.91 కోట్ల విలువైన 2,725 కేజీల మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి.

ఉత్తరాఖండ్‌లో ప్రస్తుత ఎన్నికల సమయంలో రూ.3.4 కోట్ల నగదు, రూ.3.1 కోట్ల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. 2012లో ఈ రాష్ట్రంలో పట్టుకున్న నగదు రూ.1.3 కోట్లు, మద్యం విలువ రూ.15.15 లక్షలు. పంజాబ్‌లో 2012లో రూ.11.51 కోట్ల నగదు, రూ.2.59 కోట్ల మద్యాన్ని పట్టుకోగా 2017లో రూ.58.02 కోట్ల నగదు, 13.36 కోట్ల విలువైన మద్యాన్ని పట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement