ముగ్గుర్ని సస్పెండ్‌ చేసిన అధికారులు

In UP Cancer Patient Beaten By Staff For Using Staff Toilet - Sakshi

లక్నో : అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల పట్ల సానుభూతి చూపాల్సింది పోయి వారిని చితక్కొట్టారు ఆస్పత్రి సిబ్బంది. స్టాఫ్‌ టాయిలెట్స్‌ వాడినందుకు గాను క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ మహిళను దారుణంగా అవమానించడమే కాక ఆమె కుమారుడి మీద కూడా దాచి చేశారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీ(కేజీఎంయూ)లో జరిగిందీ దారుణం. స్టాఫ్ టాయిలెట్స్ ఉపయోగించుకోవడానికి ప్రయత్నించిందన్న కారణంతో ఓ క్యాన్సర్ పేషెంట్‌ పట్ల దౌర్జన్యంగా వ్యవహరించడమే కాక ఆమె కొడుకుపై కూడా దాడికి పాల్పడ్డారు సదరు ఆస్పత్రి సిబ్బంది.

గొడవ జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ తతంగాన్ని వీడియో తీయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఈ దాడి ఘటనపై ఔట్ పేషెంట్ ఇన్‌చార్జి ప్రొ.మనీష్ బాజ్‌పాయి సీరియస్ అయ్యారు. యువకుడిపై దాడి చేసిన ముగ్గురు సిబ్బందిని గుర్తించి.. వారిని విధుల నుంచి తొలగించారు. ఇక మీదట ఇలాంటి గొడవలు జరగకుండా చూస్తామని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top