కోళ్లకు కూడా టికెట్‌ ఇవ్వాలంటూ.. | Bus Conductor Demands Ticket To Hens | Sakshi
Sakshi News home page

కోళ్లకు కూడా టికెట్‌ ఇవ్వాలంటూ..

May 2 2019 1:58 PM | Updated on May 2 2019 1:58 PM

Bus Conductor Demands Ticket To Hens - Sakshi

ఒక్కో కోడికి రూ. 77  చొప్పున రూ. 154  చెల్లించాలని...

యశవంతపుర : బస్సులో ప్రయాణించే చిన్నారులకు అరటికెట్‌ తీసుకోవడం సాధారణం. అయితే  కోళ్లకు కూడా అర టికెట్‌ తీసుకోవాల్సిందేని కండక్టర్‌ ఒత్తిడి చేయడంతో ఓ ప్రయాణికుడు తన కోళ్లను తీసుకొని మధ్యలోనే బస్సు దిగి వెళ్లిపోయాడు. ఈ ఘటన దక్షణ కన్నడ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఉప్పినంగడి సమీపంలోని కుప్పెట్టికి చెందిన వ్యక్తి శిరాడి కారణికలోని ప్రసిద్ద దేవస్థానంలో మొక్కులు తీర్చుకునేందుకు  బుధవారం రెండు కోళ్లను కొన్నాడు. వాటిని తీసుకొని సంచిలో ఉంచుకొని ఉప్పినండి–సకలేశపురల మధ్య సంచరించే కేఎస్‌ఆర్‌టీసీ బస్‌ ఎక్కాడు.

అయితే  రెండు కోళ్లను చూసిన కండక్టర్‌  వాటికి అరటికెట్‌  తీసుకోవాలని, ఒక్కో కోడికి రూ. 77  చొప్పున రూ. 154  చెల్లించాలని సూచించాడు. ఇద్దరి మధ్య తీవ్రమైన వాదులాట జరిగింది.  ప్రాణంతో ఉన్న కోళ్లను తీసుకెళ్లాలంటే తప్పని సరిగా టికెట్‌ తీసుకోవాలని, ఇదీ ప్రభుత్వం అదేశామని కండక్టర్‌ తెల్చి చెప్పాడు. దీంతో ఆ ప్రయాణికుడు మధ్యలోనే బస్సు దిగి వెళ్లాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement