భారత భూభాగంలో పాక్‌ డ్రోన్‌.. | BSF Spots Pakistan Origin Drone In Ferozepur | Sakshi
Sakshi News home page

భారత భూభాగంలో పాక్‌ డ్రోన్‌..

Oct 8 2019 2:27 PM | Updated on Oct 8 2019 2:27 PM

BSF Spots Pakistan Origin Drone In Ferozepur - Sakshi

భారత భూభాగంలో పాకిస్తాన్‌కు చెందిన డ్రో‍న్‌ చక్కర్లు కొట్టడం కలకలం రేపింది.

సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ వద్ద అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్‌కు చెందిన డ్రోన్‌ను మంగళవారం సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) గుర్తించింది. హుస్సేనివాలా చెక్‌పోస్ట్‌ సమీపంలోని హెచ్‌కే టవర్‌ వద్ద ఈ డ్రోన్‌ను బీఎస్‌ఎఫ్‌ పసిగట్టింది. ఈ డ్రోన్‌ భారత్‌ భూభాగంలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే ఐదు సార్లు భిన్న ప్రాంతాల్లో బీఎస్‌ఎఫ్‌కు కనిపించింది. పాక్‌ డ్రోన్‌ను గుర్తించిన బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. సరిహద్దు ప్రాంతాల్లో మందులు, ఆయుధ సామాగ్రిని చేరవేసేందుకు సాక్‌కు చెందిన ఉగ్రవాద గ్రూపులు ఈ డ్రోన్‌ను ఉపయోగించాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా సరిహద్దు వెంట ఆయుధాలు జారవిడించేందుకు ఉపయోగిస్తున్న రెండు డ్రోన్లను ఇటీవల పంజాబ్‌ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో తాజా ఘటన చోటుచేసుకోవడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement