భారత్, పాకిస్థాన్ సరిహద్దులో ఇరు దేశాల భద్రతా సిబ్బంది సమావేశం నిర్వహించారు
జమ్మూ: భారత్, పాకిస్థాన్ సరిహద్దులో ఇరు దేశాల భద్రతా సిబ్బంది సమావేశం నిర్వహించారు. సాంబా జిల్లాలో ఆర్ ఎస్ పుర సెక్టార్ వద్ద ఆదివారం ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు బార్డర్ సెక్యురిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) అధికారి సోమవారం వెల్లడించారు. సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని గురించి సమావేశంలో చర్చించినట్లు తెలిపిన ఆయన ఇరుదేశాల సైనికులు కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పాకిస్థాన్కు చెందిన నలుగురు సైనికాధికారుల బృందం పాల్గొంది. నవంబర్ 3న జరిగిన ఫ్లాగ్ మీటింగ్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నట్లు తెలిపారు.