ఢిల్లీ-జమ్మూ రైలుకు బాంబు బెదిరింపు | Bomb threat delays Jammu-Delhi Rajdhani | Sakshi
Sakshi News home page

ఢిల్లీ-జమ్మూ రైలుకు బాంబు బెదిరింపు

Dec 8 2014 8:53 AM | Updated on Sep 2 2017 5:50 PM

జమ్మూ నుంచి ఢిల్లీ వస్తున్న రాజధాని ఎక్స్ప్రెస్లో బాంబు పెట్టినట్టు బెదిరింపులు వచ్చాయి.

చండీగఢ్: జమ్మూ నుంచి ఢిల్లీ వస్తున్న రాజధాని ఎక్స్ప్రెస్లో బాంబు పెట్టినట్టు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆదివారం రాత్రి పంజాబ్లోని పఠాన్కోట్ వద్ద రైలును ఆపివేశారు. సైన్యం, పోలీసులు రంగంలోకి దిగి  నాలుగు గంటలకు పైగా రైలును తనిఖీ చేశారు. రైలులో ఎలాంటి పేలుడు పదార్థాలూ లేవని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

రైలులో పేలుడు పదార్థాలున్నట్టు జమ్మూకశ్మీర్ పోలీసులకు సమాచారం వచ్చింది. వారు వెంటనే పంజాబ్ పోలీసులకు ఈ విషయాన్ని చేరవేశారు. దీంతో భదత్ర సిబ్బంది అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. అనంతరం సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో రైలు బయల్దేరింది. పఠాన్కోట్ పాకిస్థాన్ సరిహద్దులకు దగ్గరగా ఉండటం, ఇటీవల జమ్మూలో ఉగ్రవాద దాడులు పెరిగిన నేపథ్యంలో నిఘా పెంచారు.
 

Advertisement
 
Advertisement
Advertisement