పట్నాలో పడవ బోల్తా : 20 మంది మృతి | Boat capsizes in Patna Ganga River huge Died | Sakshi
Sakshi News home page

పట్నాలో పడవ బోల్తా : 20 మంది మృతి

Jan 14 2017 9:19 PM | Updated on Apr 7 2019 3:24 PM

పట్నాలో పడవ బోల్తా : 20 మంది మృతి - Sakshi

పట్నాలో పడవ బోల్తా : 20 మంది మృతి

బిహార్ రాజధాని పాట్నాలో శనివారం ఘోర ప్రమాదం సంభవించింది.

బిహార్ : బిహార్ రాజధాని పాట్నాలో శనివారం ఘోర ప్రమాదం సంభవించింది. గంగానదిలో 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ బోల్తాపడింది. ఈ ఘటనలో 20 మంది మృతిచెందగా మిగతా ప్రయాణికులు గాయపడ్డారు.

కైట్ ఫెస్టివల్కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రెవెన్యూ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బ‌ల‌గాలు రంగంలోకి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. పడవలో పరిమితికి మిచ్చి  ప్రయాణికులు ఎక్కడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు సమాచారం.  బిహార్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement