అవన్నీ ఒక్క బ్యాంకులో ఖాతాలే! | black money trail: all names related to only one bank | Sakshi
Sakshi News home page

అవన్నీ ఒక్క బ్యాంకులో ఖాతాలే!

Oct 29 2014 11:44 AM | Updated on Apr 3 2019 5:16 PM

అవన్నీ ఒక్క బ్యాంకులో ఖాతాలే! - Sakshi

అవన్నీ ఒక్క బ్యాంకులో ఖాతాలే!

627 మంది పేర్లతో కూడిన నల్లకుబేరుల జాబితాను సమర్పించింది. అయితే.. అవన్నీ కూడా జర్మనీలోని హెచ్ఎస్బీసీ బ్యాంకులో ఉన్న ఖాతాల వివరాలు మాత్రమేనట.

కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు 627 మంది పేర్లతో కూడిన నల్ల కుబేరుల జాబితాను సమర్పించింది. అయితే.. అవన్నీ కూడా ఫ్రాన్స్ లోని హెచ్ఎస్బీసీ బ్యాంకులో ఉన్న ఖాతాల వివరాలు మాత్రమేనట. ఈ జాబితాలో వ్యక్తుల పేర్లు, ఖాతా నెంబర్లు సహా.. ఏ ఖాతాలో ఎంతెంత మొత్తం ఉందన్న విషయాలు కూడా వివరంగా ఉన్నట్లు తెలిసింది.

అంటే.. ఇంకా స్విస్ బ్యాంకుల ఖాతాల్లో సొమ్ము వివరాలు, ఆయా ఖాతాలు కలిగి ఉన్నవాళ్ల పేర్లు ఇంతవరకు సుప్రీంకోర్టుకు కూడా చేరలేదు. ఇంకా చెప్పాలంటే, అసలు కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకా ఆయా పేర్లను సంపాదించిందో లేదో స్పష్టత లేదు. దుబాయ్, స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లోని పలు ఖాతాల్లో కూడా భారీ మొత్తంలో డబ్బు దాచుకున్నారన్న కథనాలు ఎప్పటినుంచో ఉన్నాయి. వాటి వివరాలు కూడా ఇంకా బయటకు వస్తే.. జాబితా మరింత పెద్దది కావడం ఖాయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement