నేడు చైనాకు బీజేపీ ప్రతినిధి బృందం | BJP's youth wing delegation visits Zhejiang in China | Sakshi
Sakshi News home page

నేడు చైనాకు బీజేపీ ప్రతినిధి బృందం

Nov 15 2014 7:12 AM | Updated on Mar 29 2019 9:14 PM

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) కేంద్ర కమిటీ ఆహ్వానం మేరకు బీజేపీ ప్రతినిధి బృందం శనివారం చైనా పర్యటనకు వెళ్లనుంది.

న్యూఢిల్లీ: కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) కేంద్ర కమిటీ ఆహ్వానం మేరకు బీజేపీ ప్రతినిధి బృందం శనివారం చైనా పర్యటనకు వెళ్లనుంది. ఉత్తరాఖండ్ మాజీ సీఎం, ఎంపీ భగత్‌సింగ్ కోషియారి నేతృత్వంలో 13 మంది సభ్యుల బృందం వారంపాటు చైనాలో పర్యటించనుంది. ఈ బృందానికి బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం కన్వీనర్‌గా ఉన్నారు. సీపీసీ, బీజేపీ రాజకీయ వ్యవహారాలు, ఎజెండాలపై అవగాహన సహా పలు అంశాలపై కమిటీ అధ్యయనం చేయనుంది.

Advertisement
 
Advertisement
Advertisement