
బీజింగ్: లంచం తీసుకున్నారనే ఆరోపణలపై మరణశిక్ష ఎదుర్కొంటున్న చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ నేత, మాజీ వ్యవసాయ, గ్రామీణ వ్యవహారాల శాఖ మంత్రి టంగ్ రెంజియన్‌కు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 2007–2024 వివిధ హోదాల్లో పనిచేసి, అధికారాన్ని దురి్వనియోగం చేశారని ఆరోపించింది. సుమారు రూ.336 కోట్ల మేర లంచాలు తీసుకున్నారని తెలిపింది.
అయితే, తన ఆస్తులతోపాటు, అక్రమంగా సంపాదించిన సొత్తును సైతం ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించారని, విచారణకు పూర్తిస్థాయిలో సహకరించారని కోర్టు తెలిపింది. పశ్చాత్తాపం వ్యక్తం చేసినందున ఆయనకు మరణ శిక్షను రద్దు చేస్తూ రెండేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు పేర్కొంది. జిలిన్ ప్రావిన్స్‌లోని చంగ్‌చున్ పీపుల్స్ కోర్ట్ ఆదివారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. 2012లో జిన్‌పింగ్ అధికార పగ్గాలు చేపట్టాక అవినీతి ఆరోపణలునన కనీసం 10 లక్షల మంది అధికారులకు శిక్షలుపడ్డాయి. వీరిలో కమ్యూనిస్ట్ పార్టీ అగ్ర నేతలు సైతం పదుల సంఖ్యలో ఉన్నారు.