బిహార్ లో బీజేపీ ముందంజ! | bjp allience will win in bihar elections | Sakshi
Sakshi News home page

బిహార్ లో బీజేపీ ముందంజ!

Nov 6 2015 9:48 PM | Updated on Jul 18 2019 2:11 PM

బిహార్ లో బీజేపీ ముందంజ! - Sakshi

బిహార్ లో బీజేపీ ముందంజ!

బిహార్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాకపుట్టిస్తున్నాయి. నిన్నటి వరకు ఆయా టీవీ చానెళ్లు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో నితీశ్ కుమార్ ఆధ్వర్యంలోని మహాకూటమి విజయం సాధిస్తుందని స్వల్ప తేడాతో బీజేపీ ఓటమి చూడనుందని చెప్పగా శుక్రవారం ఎన్డీటీవీ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా కనిపించాయి.

పాట్నా: బిహార్ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాకపుట్టిస్తున్నాయి. నిన్నటి వరకు ఆయా టీవీ చానెళ్లు వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలోని మహాకూటమి విజయం సాధిస్తుందని స్వల్ప తేడాతో బీజేపీ ఓటమి చూడనుందని చెప్పగా శుక్రవారం ఎన్డీటీవీ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా కనిపించాయి.

విజయం ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమిదేనని ఎగ్జిట్ పోల్ ద్వారా వెల్లడయ్యాయి. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలోని మహాకూటమికి మొత్తం 243 స్ధానాల్లో 105 నుంచి 115 స్థానాల వరకు వస్తాయని తేలగా.. బీజేపీ కూటమికి 120 నుంచి 130 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఇక ఇతరులకు ఐదు నుంచి పది స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపాయి.
కాగా, అంతకుముందురోజు ఆయా చానెళ్లు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో బిహార్ వాసులు... మహాకూటమికే పట్టంగట్టే అవకాశం ఉందని అంచనాలు వేశాయి. ముఖ్యంగా టైమ్స్ నౌ వర్గాలు జేడీయూ 112-132 స్థానాలతో మహాకూటమి అధికారం చేపట్టే అవకాశం ఉందని స్పష్టం చేయగా, ఇండియాటుడే - సిసెరో సంస్థలు నిర్వహించిన సర్వేలో మాత్రం ఎన్డీయేకు 120, మహాకూటమికి 117 స్థానాలు రావొచ్చని అంచనా వేసింది.
గురువారం ఆయా చానెళ్లు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు
మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు: 243

Advertisement
 
Advertisement
Advertisement