'ఓడిపోవడానికి బిహార్‌ బేటిని పెట్టారు' | 'Bihar Ki Beti' Meira Kumar Has Been Nominated Only To Lose: Nitish Kumar | Sakshi
Sakshi News home page

'ఓడిపోవడానికి బిహార్‌ బేటిని పెట్టారు'

Jun 24 2017 9:18 AM | Updated on Sep 5 2017 2:22 PM

'ఓడిపోవడానికి బిహార్‌ బేటిని పెట్టారు'

'ఓడిపోవడానికి బిహార్‌ బేటిని పెట్టారు'

లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ అంటే తనకు అమితమైన గౌరవం అని బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ అన్నారు.

పట్నా: లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ అంటే తనకు అమితమైన గౌరవం అని బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ అన్నారు. అయిన, రాష్ట్రపతి ఎన్నికల విషయంలో తన మద్దతు ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కేనని ఈ విషయంలో తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. ఓడిపోవడానికి బిహార్‌ కి బేటీని(మీరాకుమార్‌)ను ప్రతిపక్షాలు నిలబెట్టాయని విమర్శించారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి నితీష్‌ మద్దతివ్వడం చారిత్రక తప్పిదం అని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ అన్న నేపథ్యంలో ఆ ఇద్దరు విడిపోయినట్లేనని అందరూ భావించారు. కానీ, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు నితీష్‌ కుమార్‌ హాజరయ్యారు. అయితే, ఈ సమయంలో వారిద్దరి మధ్య చర్చ జరిగి తిరిగి నితీష్‌ తన నిర్ణయాన్ని మార్చుకుంటారని అనుకున్నారు. అయితే, తన నిర్ణయం మారే ప్రసక్తి లేదని చెప్పారు. అయినా, తమ బంధానికి రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధం లేదని చెప్పారు. కాంగ్రెస్‌ అభ్యర్థి మీరా కుమార్‌కే లాలూ ప్రసాద్‌ మద్దతిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement