రూట్ చెప్పడానికి ముందు సీట్లో కూర్చొమ్మని.. | Belgian woman molested in Delhi, driver detained | Sakshi
Sakshi News home page

రూట్ చెప్పడానికి ముందు సీట్లో కూర్చొమ్మని..

May 8 2016 9:05 AM | Updated on Jul 23 2018 8:49 PM

రూట్ చెప్పడానికి ముందు సీట్లో కూర్చొమ్మని.. - Sakshi

రూట్ చెప్పడానికి ముందు సీట్లో కూర్చొమ్మని..

ఓ ఓలా క్యాబ్ డ్రైవర్ అసభ్యతకు దిగాడు. బెల్జియానికి చెందిన 23 ఏళ్ల మహిళపై ఓలా క్యాబ్ డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

న్యూఢిల్లీ: ఓ ఓలా క్యాబ్ డ్రైవర్ అసభ్యతకు దిగాడు. బెల్జియానికి చెందిన 23 ఏళ్ల మహిళపై ఓలా క్యాబ్ డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దక్షిణ ఢిల్లీలోని సీఆర్ పార్క్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం రాత్రి బాధితురాలు ఫిర్యాదు చేసుకుంది. 'ఈ సంఘటన జరిగిన తర్వాత కొద్ది గంటల్లోనే మేం డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నాం.

అతడు రాజస్థాన్ లోని అల్వార్ ప్రాంతానికి చెందినవాడు' అని పోలీసులు తెలిపారు. గూర్గావ్ ప్రాంతంలో ఓ బెల్జియం మహిళ ఢిల్లీకి ఓలా క్యాబ్ బుక్ చేసుకుంది. అయితే, జీపీఎస్ వ్యవస్థ పనిచేయడం లేదని, వచ్చి ముందుకూర్చుని రూట్ చూపించాలని కోరాడు. అనంతరం ఆమె ముందు కూర్చొని దారి చూపించే క్రమంలో లైంగికంగా, అసభ్యకరంగా తాకడం మొదలు పెట్టాడు. అలా, ఆమె వచ్చే మార్గంలో చాలాసేపు లైంగికంగా వేధించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement