మనీలాండరింగ్‌ కేసులో ఖురేషీకి బెయిల్‌ | bail granted to khureshi | Sakshi
Sakshi News home page

మనీలాండరింగ్‌ కేసులో ఖురేషీకి బెయిల్‌

Dec 12 2017 11:59 AM | Updated on Dec 12 2017 11:59 AM

bail granted to khureshi - Sakshi

న్యూఢిల్లీ : వివాదాస్పద మాంసం వ్యాపారి మొయిన్‌ ఖురేషీకి మంగళవారం బెయిల్‌ లభించింది.  ఈ మేరకు మనీలాండరింగ్‌ కేసులో ఖురేషీకి ఢిల్లీ పాటియాలా హౌస్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అక్రమ హవాలా కార్యకలాపాలతో నగదును ట్రాన్సఫర్‌ చేపడుతున్నాడనే ఆరోపణల నేపథ్యంలో మొయిన్‌ ఖురేషిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఆయనపై నేరపూరిత కుట్రలతో పాటుగా  తన హవాలా ఛానళ్లను మనీ ఛేంజర్‌ సహాయంతో డబ్బును బదిలీ చేయడానికి ఉపయోగించాడనే అభియోగాలు ఉన్నాయి. చాలాకాలం ఈడీ అధికారుల కళ్లుగప్పి తిరిగిన ఖురేషిని ఎట్టకేలకు పట్టుకుని, కోర్టులో హాజరు పరిచిన విషయం తెలిసిందే. మనీల్యాండరింగ్‌ కేసులో ఖురేషీపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ‘లుక్‌ అవుట్‌ సర్కులర్‌’(ఎల్‌వోసీ) జారీ చేసింది కూడా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement