భారత స్వాగతానికి ఆస్ట్రేలియా ప్రధాని ఖుషీ | Australian PM arrives in Delhi | Sakshi
Sakshi News home page

భారత స్వాగతానికి ఆస్ట్రేలియా ప్రధాని ఖుషీ

Sep 5 2014 12:09 PM | Updated on Aug 15 2018 2:20 PM

భారత స్వాగతానికి ఆస్ట్రేలియా ప్రధాని ఖుషీ - Sakshi

భారత స్వాగతానికి ఆస్ట్రేలియా ప్రధాని ఖుషీ

భారతదేశంలో తనకు లభించిన స్వాగతానికి ఆస్ట్రేలియా ప్రధాని అబాట్ పొంగిపోయారు.

ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ అబాట్ ఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆయనకు సాదర స్వాగతం పలికారు. ''ఆస్ట్రేలియా ప్రధానికి సాదర స్వాగతం. ఆయన పర్యటన ఆస్ట్రేలియా, భారతదేశాల మధ్య సంబంధాలను మరింత పటిష్ఠం చేస్తుందని నేను నమ్ముతున్నాను'' అని తన ట్విట్టర్లో కూడా పెట్టారు.

దాంతో అబాట్ కూడా ఎంతగానో సంతోషించారు. 'భారత ప్రధాని నరేంద్రమోడీ అద్భుతమైన అధికారిక స్వాగతం పలికారు' అని ఆయన ట్వీట్ చేశారు. విమానాశ్రయంలో అబాట్కు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్వాగతం పలికారు. టోనీ అబాట్ గురువారమే భారత్ వచ్చి.. ముందుగా ముంబై వెళ్లిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement