బీజేపీకి కేజ్రీవాల్‌ సవాల్‌.. | Arvind Kejriwal Challenged The BJP To Name Its CM Candidate | Sakshi
Sakshi News home page

బీజేపీకి కేజ్రీవాల్‌ సవాల్‌..

Feb 4 2020 3:14 PM | Updated on Feb 4 2020 6:12 PM

Arvind Kejriwal Challenged The BJP To Name Its CM Candidate - Sakshi

ఢిల్లీ సీఎం అభ్యర్ధిని ప్రకటించాలని కాషాయ పార్టీని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు.

సాక్షి, న్యూఢిల్లీ : మరో మూడు రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో బీజీపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరో వెల్లడించాలని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కాషాయ పార్టీకి సవాల్‌ విసిరారు. దీనిపై ఎవరితోనైనా చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. బుధవారం మధ్యాహ్నం 1 గంటలోగా బీజేపీ తమ పార్టీ సీఎం అభ్యర్ధిని వెల్లడించాలని లేనిపక్షంలో తాను మరోసారి మీడియా ముందుకు వస్తానని చెప్పారు. బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ప్రజల తీర్పును కోరుతోందని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ప్రజాతీర్పు వెలువడిన తర్వాత సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని అమిత్‌ షా చెబుతున్నారని, కానీ బీజేపీకి ఓటు వేస్తే ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారనేది ఢిల్లీ ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారన్నారు. విద్యాభ్యాసం లేని అసమర్ధుడిని సీఎంగా అమిత్‌ షా ప్రకటిస్తే అప్పుడు ఢిల్లీ ప్రజలను మోసగించినట్టు కాదా అని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. 

చదవండి : ‘కేజ్రీవాల్‌ ఓ టెర్రరిస్ట్‌’

Advertisement
 
Advertisement
Advertisement